MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:12 pm Posted by : MANA TOLIVELUGU

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలి

ఈ నెల 31న ఐలు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

అక్టోబర్ 23న దేశవ్యాప్త నిరసనలకు పిలుపు

మన తొలివెలుగు | భువనగిరి జిల్లా రూరల్ ప్రతినిధి | కే. నాగమణి | అక్టోబర్ 17, 2026 :

ఈ నెల 31న నిర్వహించనున్న ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) యాదాద్రి భువనగిరి జిల్లా రెండో మహాసభలను విజయవంతం చేయాలని ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, న్యాయవాది మామిడి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. భువనగిరిలో నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య హక్కులపై దాడులు, అక్రమ అరెస్టులను ఖండిస్తూ అక్టోబర్ 23న దేశవ్యాప్త నిరసనలను విజయవంతం చేయాలని కోరారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను రద్దు చేయాలని, రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ, నిరసన హక్కు, ఓటు హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ఐలు జిల్లా అధ్యక్షుడు బొల్లేపల్లి కుమార్ అధ్యక్షత వహించగా, జిల్లా కోశాధికారి బొడ్డు కిషన్, జిట్ట భాస్కర్ రెడ్డి, పిడుగు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.